"అధ్యాపక మిత్రులందరికీ నమస్కారాలు !
చట్టాలు చదువుతుంటే చాలా ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు ఎలా కళాశాలను నిర్వహిస్తున్నాయో మనకు అర్థమౌతుంది. కమిషనర్ కంటే పవర్ ఫుల్ అని చెప్పుకునే కరస్పాండెంట్స్, వారికి భజన చేసే ప్రిన్సిపాల్స్, వీరికి ఈ చట్టాల్ని చుట్టాలుగాచేసి యాజమాన్యాన్ని కమీషనర్ కంటే గొప్ప అధికారిగా అభివర్ణించే క్రిందిస్థాయి అధికారులు. ఇప్పటిదాకా ఇటువంటివారి మాటలను ప్రతిఒక్కరు వివిధ సందర్భాలలో విన్న జ్ఞాపకమే! ఇప్పటివరకు వినీ వినీ ఆశ్చర్యం కలిగింది. స్వార్థపరులు చెప్పేవి సరే ... అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి. క్షేత్ర స్థాయిలో వీటిని తూచా అనుసరించాల్సిన ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు ఎలా కళాశాలలను నిర్వహిస్తున్నాయి? ఈ కోణంలో తులనాత్మకంగా పోల్చి చూస్తే ఒకటి కాదు; ఎయిడెడ్ కళాశాలలలొ ఎన్ని లోటుపాట్లో!. ఇన్నాళ్లపాటు చట్టాలు చదివి తెలుసుకోక పోవడం మన తప్పేనని అర్థం అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిఒక్క అధ్యాపకుడు ఆక్ట్ పట్ల అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. మనం పనిచేసే కళాశాలలలొ నిష్కారణంగా యాజమాన్యం అవలంబించిన నిబంధనలకు విరుద్ధమైన చర్యలకు, వారి కక్షపూరితంగా చర్యలకు ఇబ్బందులుపాలైన అధ్యాపకులగూర్చి మీకు గుర్తుకు రాక మానదు. సమయానికి కళాశాలకు రావడం, సమయానికి క్లాస్ రూంకు వెళ్లడం, విద్యార్థులకు అర్థం అయ్యేలా పాఠం చెప్పడం, మనం బోధించే సబ్జెక్టు లో మంచి ఫలితాలు సాధించడమే అధ్యాపకుని ప్రధాన కర్తవ్యాలు. ఎకాడమిక్ గా టీచింగ్ నోట్స్, టీచింగ్ డైరీ , అప్పజెప్పే ఇతర పనులు. ఇందులో మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా; ఒక అధ్యాపకునికి ఎంత గొప్ప ప్రొఫైల్ ఉన్నా కుంటి సాకులు, దొంగ ఆరోపణలు చేసి నిబంధనలను తుంగలో తొక్కే కొన్ని యాజమాన్యాలు కొందరిని ఉద్దేశ పూర్వకంగా, వారి ఇష్టానుసారంగా సస్పెండ్ ~ సరెండర్ చేస్తున్నాయంటే వీళ్ళకి విద్యావ్యవస్థలో ఆ స్థానాలలో ఉండే అర్హత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఊతపదంలా "ఎ.పి.ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982" వాడడం, వారి సిగ్గుమాలిన నిరాధారమైన ఆరోపణల చివర తోకలా తగిలించి సస్పెండ్ చేసే కాలం చెల్లనున్నది. మనమూ ఇటువంటి యాజమాన్యం తప్పిదాలను వారిలాగా కాకుండా పక్కాగా చాఫ్టర్, రూల్, సబ్ సెక్షన్ తో సహా కోడ్ చేసి అధికారులముందు న్యాయం కోసం యాజమాన్యం తప్పులను చూపే అవగాహన కొరకే ఈ రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు డాక్టా ఏర్పాటు చేస్తుంది. మేము పర్ఫెక్ట్ అనుకునే ఎయిడెడ్ కళాశాల యాజమాన్యాలకు కూడా తెలిసేలా మీలోని కొన్ని కళాశాల యాజమాన్యాలు నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఎలా వ్యవహరించాయో, ఎయిడెడ్ కళాశాలలకు మాయని మచ్చలా చెడ్డపేరు మూట గడుతున్నాయో కళాశాలల పేర్లు పేర్కొంటూ, అతిక్రమించిన నిబంధనలను ఉదహరిస్తూ డాక్టా ఒక ప్రచురణ తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. కనుక అధ్యాపక మిత్రులారా (1)AP EDUCATION ACT 1982,(2)Andhra Pradesh Commissionerate of Higher Education Act, 1986.,(3) Andhra Pradesh Educational Institutions (Establishment, Recognition, Administration and Control of Institutions of Higher Education) Rules, 1987. (4),Andhra Pradesh Educational Institutions (Parent-Teachers Association) Rules,1987 మొదలగు చట్టాలపై 19/1/2020న గుంటూరులో ఉదయం 10.30 కు ప్రారంభం అయే ఈ సదస్సుకు దళిత అధ్యాపకులే కాదు; ఎవరైనా హాజరు కావచ్చు" అని డాక్టా ఇచ్చిన పిలుపు మేరకు ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982పై 19 జనవరి 2020 న ఒకరోజు రాష్ట్రస్థాయి డాక్టా సదస్సుకు సుదూర ప్రాంతాల నుండి శ్రమకోర్చి హాజరై సభను విజయవంతం చేసిన డాక్టా సభ్యులకు, వివిధ సంఘ నాయకులకు డాక్టా ఛైర్మన్, అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్, డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ కాకాని సుధాకర్ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే సహకారం మీ నుండి కోరుకుంటున్నాము.



























No comments:
Post a Comment