ప్రారంభంలో విద్య సేవాభావంతో ప్రారంభించడం వాస్తవామే. దాతలు చేయూతతో వితరణలతో ప్రారంభం కావడమూ వాస్తవమే . ఇటువంటి వాటిని ప్రోత్సహించాలని గ్రాంట్ ఇన్ ఎయిడ్ తో ఎయిడెడ్ కళాశాలలుగా ఇటువంటివాటిని ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రారంభించిందీ అందరూ ఎరిగిన సత్యం. కాని ...... రాను రాను ...మరీ రెండు దశాబ్దాల నుండి ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యం తీరు ఆక్షేపణీయం. అధికారులన్నా... ప్రభుత్వ నిబంధనాలన్నా లెక్కలేని తనం. నిధుల స్వాహా, ఆర్థిక అవకతవకలు, ఎన్నో ఇర్రెగ్యులారిటీస్ ఒక ఎత్తయితే రకరకాల పేరుతో ఎయిడెడ్ కళాశాలలలొ పనిచేసే అధ్యాపకులను వేధించడం , సస్పెండ్ చెయ్యడం , హీనంగా చూడడం భరించరానిది.
యాజమాన్యాలు ఎలా మాట్లాడుకుంటున్నాయో గమనించండి. నిజమే! ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలకు తెలిసినంతగా ఐ .ఎ .ఎస్. చదువుకున్నవారికి ఏమీ తెలియదు. చివరికి ముఖ్యమంత్రి గారికి కూడా ఏమి తెలియదు. ఐ ఎ ఎస్ లను ఎడ్యుకేట్ చేస్తారట! ఐ ఎ ఎస్ లు తెలిసీ తెలియని తనం తో నిర్ణయాలు తీసుకుంటారట ! ఎయిడెడ్ కాన్సెప్ట్ ఉనికి చాలా ముఖ్యమైనదట!! రాజకీయ నాయకులను పట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన విషయాల కప్పి పుచ్చుకోవడం బాగా తెలుసు. రూల్స్ ను అతిక్రమించడం, అవకతవకలకు పాల్పడడం తెలుసు.
https://youtu.be/iHEMvcqWYVQ
https://youtu.be/oqwWvMeQWEo
https://youtu.be/izcinShMmjQ
https://youtu.be/Wcb-GEZC6t8
1) అన్ ఎయిడెడ్ లెక్చరర్స్ చేత పాఠాలు చెప్పిస్తున్నాము గనుక ప్రతి విద్యార్థి పై వెయ్యి రూపాయలు అదనంగా ఫీజువేశామంటూ కరస్పాండెంట్ వివరణ ఇవ్వడంలో విద్యాసేవ ఎక్కడుంది ?.
2) నాకు లాభం వద్దు, నష్టం అసలు వద్దు!..... ... నాకు స్కూల్స్ ఉన్నాయి. వేరే ఉన్నాయి. ఇంకోళ్ళెవరికో రెంట్ కిచ్చుకుంటాను. నాకెందుకీ క్యాంపస్ . హ్యాపీగా బయట తిరుక్కుంటాను.
3) ... ... "ఇది ప్రయివేట్ కాంపస్ . ఇది గవర్నమెంట్ కాంపస్ కాదు. ..... నువ్వు పదిమందిని తెస్తే నేను వెయ్యి మందిని తెస్తా . తన్నిపంపిస్తా ఈసారి ...... .... ఇట్స్ ఎ ప్రయివేట్ ప్రాపర్టీ .
ఇవి అభ్యంతరకర మైన మాటలు. ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడకూడదు. రెడ్డి కాలేజీ సెక్రటరీ, ఎమ్మెల్యే శ్రీ కాసు మహేష్ రెడ్డి గారి వలే చాలామంది కరెస్పాండెంట్స్ ఎయిడెడ్ కాలేజీలను వారి సొంత ఆస్తిలాగే భావిస్తున్నారు. అందుచేతనే వారి మాటల్లో "
ఇంకోళ్ళెవరికో రెంట్ కిచ్చుకుంటాను. నాకెందుకీ క్యాంపస్ . హ్యాపీగా బయట తిరుక్కుంటాను."అని అనగలిగారు. ఇందులో సేవాభావమెక్కడ ఉంది ?
కనుకనే జగన్ ప్రభుత్వంఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వ కళాశాలలుగా మార్చాలి. ఇది విద్యా చట్టం 1982 లోనే ఉంది . ఈ కాలేజీ నాది. రెంట్ కు ఇచ్చుకుంటాను ... అమ్ముకుంటాను అంటే కుదరదు . ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982 లో 10వ చాఫ్టర్ ఇటువంటి బదలాయింపులను నిరోదిస్తూ రాయబడింది. అదేవిధంగా ప్రభుత్వానికి ఇవ్వడానికి మాకు ఇష్టం లేదు అందానికి ఎయిడెడ్ కాలేజీల యాజమాన్యాలకు హక్కులేదు.. ఈ విషయాలను ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982 లోని 11వ చాఫ్టర్ చెబుతుంది.









No comments:
Post a Comment