అధ్యాపక మిత్రులకు నమస్కారాలు . నా దృష్టిలో ఒక సంస్థ,సంఘం లేదా అసోసియేషన్ ... పేరు ఏమన్నా గాని , ముఖ్యంగా ఉద్యోగుల సంఘంగా ఉన్నవి కేవలం వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి... వారి హక్కులను, ప్రయోజనాలను కాపాడుకోవడానికి మాత్రమే పరిమితంకాకుండా సమాజానికి ఉపయోగపడే... ఇతరులను గుర్తించి ప్రోత్సహించే... ఇతరులను ఆలోచింపజేసి చైతన్యపరిచే ఏదో ఒక రూపంలోని పనిని బాధ్యతగా చెయ్యాలనేది నా ఆలోచన. ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యలపై ప్రతిసంఘం రొటీన్ గా ఇచ్చే వినతిపత్రాలు, సమస్య పరిష్కార మార్గాలు. ఇటువంటి సంఘాలకు భిన్నంగా మన డాక్టా ఉండాలన్నదే నా, మా ఆలోచన. ఆ ఆలోచనల కార్య రూపమే ఇటీవల డాక్టా ప్రదానం చేసిన "సావిత్రిబాయి ఫూలే ఉత్తమ అధ్యాపకుల పురస్కారాలు". అదేవిధంగా జనవరి 19న గుంటూరులో జరగనున్న"ఏ పి ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982"పై జరగనున్న రాష్ట్రస్థాయి. దీని తర్వాత డాక్టా సమాజానికి ఉపయోగపడే ప్రచురణలు కూడా చేపట్టాలనేది ఆలోచన. ఈ ఆలోచనల ప్రతిరూపమే" వర్తమాన భారతదేశం ~ దళిత శకం "అనే ఈ వ్యాస సంకలనం. మంచి వ్యాసాలను మన అధ్యాపకులచే రాయించి, డా జి లక్ష్మి నరసయ్య మొదలగు న్యాయనిర్ణేతలచే ఎంపిక చేసి , పుస్తకంగా ముద్రించి, ఈ వ్యాస సంకలనాన్నిఉన్నత స్థానంలో ఉన్న మన దళిత బిడ్డకు ఒకరికి అంకితమిచ్చి , ఈ సంపుటి ఆవిష్కరణకు మన ప్రజాప్రతినిధులను ~అధికారులను ఆహ్వానించి మన డాక్టా చేస్తున్న కార్యక్రమాలగూర్చి వారు స్వయంగా తెలుసుకొని ఉత్తరోత్తర వారి సహాయ సహకారాలు మన "డాక్టా కు అందించే ఒక గొప్ప పనికి శ్రీకారం ఈ ఆలోచన.ఇది ఒక ప్రయోజనం. అంతేకాదు ఒక వ్యాసముద్వారా మన ఆలోచనా విధానాన్ని తెలియజేసే సంతృప్తిని మనం పొందడం మరో ప్రయోజనం. డాక్టా ఈ బుక్స్ ను కూడా తీసుకు రానున్నది. ఈ వ్యాస సంకలనానికి సంబంధించి నియమ నిబంధనలను త్వరలో డాక్టా ప్రధాన కార్యవర్గ సభ్యులు తెలియ జేస్తారు. లక్షలాది రూపాయలున్న సంఘాలలో పదవులకై పోటీపడి పనిచెయ్యడం వేరు. కానీ ఒక సిద్ధాంతంతో డబ్బులుకూడా చూసుకోకుండా, లేకున్నా పనిచేస్తున్న మన డాక్టా సభ్యులను అభినందించాల్సిందే. ఇటువంటి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఇందులో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటుంది మీ డాక్టా . ఈ వ్యాససంపుటి నమూనా ఇంచుమించు ఇలా ఉండబోతుంది అని తెలియజేయడానికి పోస్ట్ చెయ్యడం జరుగుతుంది. మరికొన్ని ప్రయోజనకరమైన, ఆసక్తికరమైన , చైతన్యాన్ని కలిగించే అంశాలు ఈ వ్యాస సంకలనంలో ఉండ తగినివిగా మీరు భావించి సూచించగలిగితే ఆహ్వానం.
మిత్రులకు సంక్రాంతి
శుభాకాంక్షలతో ~ డా తలతోటి పృథ్వీ రాజ్ , చైర్మన్ ,డాక్టా
No comments:
Post a Comment