ఎయిడెడ్ వ్యవస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్ని ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో విలీనం చేసే ఆలోచనతో ప్రభుత్వం వడివడిగా వేస్తున్న అడుగులను అందరూ గమనిస్తూనే ఉన్నారు. కొందరు తప్ప దాదాపు అన్ని అసోసియేషన్లు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మద్దతిచ్చే అసోసియేషన్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి విలీన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం రూపొందించే గైడ్లైన్స్- విధివిధానాలలో మనకు అన్యాయం జరగకుండా ఉండేందుకు, ఈ ప్రక్రియ వేగవంతంగా అమలు అయ్యేందుకు డాక్టా-ఎ.పి. అసోసియేషన్ , ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ కళాశాల ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ప్రధాన కార్యవర్గ సభ్యులు చర్చించుకొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ప్రభుత్వ అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే విషయమై చర్చించేందుకు రేపు అనగా 4/6/2021 సాయంత్రం 4 గంటలకు గూగుల్ ద్వారా సమావేశం జరుగుతుంది. డాక్టా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సమయాన్ని పాటిస్తూ హాజరుకావాలని కోరుతూ ఆహ్వానిస్తున్నాము.~ డాక్టా - ఎ.పి.

No comments:
Post a Comment