డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం పై ఏపీ డాక్టా హర్షం
2021-2022 విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కళాశాలల్లోని కోర్సులను ఇంగ్లీష్ మీడియం లోనే నిర్వహించాలనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సూచన మేరకు ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయం పట్ల దళిత కాలేజీ టీచర్స్అసోసియేషన్(డాక్టా- ఏపీ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిందు సురేంద్ర, కార్యవర్గ సభ్యులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు,
ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ప్రధాన పాత్ర ఇంగ్లీష్ మీడియమే నని అన్నారు. చిన్నప్పటినుండి తెలుగు మీడియంలోనే చదువుకున్న వారు ఉన్నత చదువులు ముగించుకుని ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే సందర్భంలో ఇంగ్లీషు భాషలో ఎంతోమంది భావవ్యక్తీకరణ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటువంటి సందర్భంలో మూడేళ్ల డిగ్రీ కోర్సును నాలుగేళ్లు హానర్స్ కోర్సుగా చేయడం, ఇంగ్లీష్ మీడియంలోనే తప్పనిసరిగా చదవడం ద్వారా విద్యార్థులు ఇంగ్లీషులో పట్టు సాధిస్తారన్నారు,
సంక్షేమ పథకాల విషయంలోనే కాదు, విద్యా సంస్కరణలలో కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని డాక్టా చైర్మన్ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ అన్నారు. ఏ ప్రభుత్వమైతే విద్యా వైద్య రంగాల అభివృద్ధి పై దృష్టి పెడుతుందో అక్కడి ప్రజలలో విద్యా సామాజిక అంశాలలో విప్లవాత్మక ప్రగతిని సాధించవచ్చని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నాడు- నేడు, విద్యా దీవెన, విద్య వసతి వంటి పలు విద్యా పథకాలను పదుల కొద్దీ నూతన మెడికల్ కళాశాలల స్థాపన చేయడం ఇవన్నీ రాష్ట్రంలోని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయని డాక్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకాని సుధాకర్ తెలిపారు.


No comments:
Post a Comment