ప్రియమైన డాక్టా మిత్రులందరికీ జై భీమ్ లు 🙏
ఈరోజు(15/6/2021) మధ్యాహ్నం 2గంటలకు special principal secretary higher education గౌరవ సతీష్ చంద్ర IAS గారిని సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్ లో కలిసి మన అసోసియేషన్ ఫైనాన్స్ సెక్రటరీ డా కొల్లేటి రమేష్, EC మెంబర్ డా భాను నాయక్, నేను మాట్లాడాము. సార్ మన అసోసియేషన్ యెడల చాలా సానుకూలంగా ఉన్నారు. చాలా సమయం ఇచ్చి మనతో మాట్లాడారు. మనం ఇచ్చిన మెమోరాండం స్వీకరించి విలీనానికి అనుకూలంగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. విలీన ప్రక్రియ జరుగుతుంది అని చెప్పారు. విలీన సమయంలో ఎయిడెడ్ సిబ్బంది కి ఎటువంటి సమస్యలు లేకుండా కావాల్సిన సర్వీస్ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని మెమోరాండం లో అన్ని అంశాలు రాశామని వివరించాము. అన్ని విషయాలను సావదానంగా విని,ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మన అసోసియేషన్ కి సమయం ఇవ్వటమే కాకుండా సానుకూలంగా స్పందించిన సతీష్ చంద్ర సార్ కు మన డాక్టా తరుపున హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు 🌹తెలియచేస్తున్నాము. మిత్రులందరూ ఈ విషయాలన్నీ గమనించగలరు. అందరికీ జై భీమ్ లతో... డా కాకాని సుధాకర్ ప్రధాన కార్యదర్శి DACTA (డాక్టా ). 🙏


No comments:
Post a Comment