హుందాతనము లేకుండా...డాక్టా నాయకులై ఒకరుపై ఒకరు ఇలా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం ఏమీ బాగోలేదు . మునుముందు ఎన్నో సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత చాలా ఉంది . పిల్ల తరహాగానే కమిటీ సభ్యులు వ్యవహరిస్తున్నారు . ఇదేమీ బాగోలేదు . ఇగో ఫీలింగులు వదిలి, ఆక్టాని విడిచి ఒక ముఖ్య ఉద్దేశ్యంతో డాక్టా ను పెట్టేరనే కారణంతో నాలాంటి సీనియర్స్ మీకు మద్దతు పలుకుతూ మీరు స్థాపించిన డాక్టాలో చేరాము . కానీ మీరేమి చేస్తున్నారు ఇవేవో అంతర్జాతీయ పదవులన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు దగ్గరికి నేరుగా వెళ్లలేని, ఒక ఎస్సీ నాయకుని దగ్గరకు నేరుగా వెళ్లలేనివారుకూడా గొప్ప నాయకుల్లా ఫీలవద్దు .
ఏ సంస్థ కైనా అతి ప్రధానమైన వారు ప్రధాన కార్యదర్శి , అధ్యక్షుడు , కోశాధికారి . సహాయ కార్యదర్శులుకూడా అతి కీలకమైన నాయకుల్లా మాట్లాడుతున్నారు. సహాయ కార్య దర్శులు మీ చుట్టూ ఉన్న కాలేజీ లలోని ఎస్సీ ఎస్టీ అధ్యాపక మిత్రులను చేర్పించే ప్రయత్నం చెయ్యండి. పై ప్రధానమైన నాయకులు చెప్పినట్లు చెయ్యడమే మీ బాధ్యత. దీనికి ముందు ఏదో ఒక సంస్థ లో పనిచేసి ఉంటే కొంత అవగాహన ఉండేది . వాట్సాప్ లో సాగుతున్న ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించమని నా విన్నపం .
సంస్ధ అభివృద్ధిని కాంక్షిస్తూ
~ డా. తలతోటి పృథ్వి రాజ్
No comments:
Post a Comment