కొందరు ముఠాగా
ఏర్పడి వాట్సాప్ లో వారి పోస్టింగ్స్ తో డాక్టా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.
వారే డాక్టా. డాక్టానే వారు అన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. కొందరిపై
వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. పైగా చిన్నా పెద్దా లేకుండా నీతులు చెబుతున్నారు
దెయ్యాలు వేదాలు వల్లిస్తాయంటారే...అలా ! మంచినికూడా ప్రశ్నించే రకాలుగా మారారు. ఇటువంటి
వారి కారణంగానే కాకుండా డాక్టా సభ్యులు కానివారు , సభ్యత్వం కట్టనివారు ,
రెన్యువల్ చేయనివారు ఇలా అనేక రకాలుగా డాక్టా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు. ఇలా ఉండడానికి అనేక
కారణాలలో ఒకటి అడ్మిన్ గా అనేకులు ఉండడం. డాక్టా వాట్సాప్ గ్రూప్ నిర్వహణకు సంబంధించి
ముఖ్య నాయకులు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎప్పటినుండి డాక్టా వాట్సాప్ గ్రూప్
నిర్వహించ బడుతుందో తెలియ జేయడమౌతుంది.
డాక్టా అఫీషియల్ వాట్సాప్ గ్రూప్
ను ఈసారి డాక్టా ఛైర్మన్ డా తలతోటి పృథ్వి రాజ్ మాత్రమే అడ్మిన్ గా ఉంటూ నిర్వహిస్తారు . అంతవరకు డాక్టా కార్యకలాపాలను, సమాచారాలను http://dactaap.blogspot.com అనే బ్లాగ్ ద్వారా
తెలుసుకోవచ్చు.
మీరు
ఏ విషయం తెలుసుకోవాలన్నా డాక్టా ప్రధాన కార్యదర్శి డా. కాకాని సుధాకర్ గారిని ఫోన్
లో సంప్రదించి తెలుసుకోవాలని మనవి. ~ డా . తలతోటి పృథ్వి రాజ్ , చైర్మన్ , డాక్టా.
